![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో..... జానూ ఇంటికి వచ్చేసరికి పెద్దావిడ కర్రతో ఇంటిముందు ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరు అక్కడే ఉంటారు. ఏమైందని జానూ అడుగుతుంది. దొంగలు బ్యాంక్ నుంచి వచ్చామని వచ్చారు.. వాళ్ళని తరిమి కొట్టామని పెద్దావిడ చెప్తుంది. అప్పుడే పోలీసులని తీసుకొని బ్యాంకు మేనేజర్లు వస్తారు. బ్యాంకు నుంచి వచ్చామని చెప్పినా కూడా వాళ్ళతో తప్పు గా ప్రవర్తించరట అని ఇన్స్పెక్టర్ అనగానే అసలు మా ఇంటికి బ్యాంకు వాళ్ళు ఎందుకు వచ్చారని జానూ అడుగుతుంది.
మీ నాన్న బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు అందుకే ఇల్లుని జప్తు చెయ్యడానికి వచ్చామని బ్యాంకు వాళ్ళు అనగానే మా నాన్న ఎప్పుడు లోన్ తీసుకున్న విషయం చెప్పలేదని జానూ అంటుంది. అమ్మ నీకేమైన చెప్పాడా అని జానూ అడుగుతుంది. లేదు నాకు అంత గంధరగోళంలాగా ఉందని శారాద అంటుంది. సింహాద్రికి జానూ ఫోన్ చేస్తుంది. దూరం నుంచి అదంతా చూస్తూ ఉంటాడు సింహాద్రి కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత మీరు బయట వెళ్తే ఇంటికి తాళం వేస్తామని వాళ్ళు అంటారు. మాకు ఒక గంట టైం ఇవ్వండి అని జానూ రిక్వెస్ట్ చేస్తుంది. దానికి వాళ్ళు సరే అంటారు . జానూ, నందు ఇద్దరు కలిసి సింహాద్రి ఇంటికి బయల్దేరతారు. మరొకవైపు సూర్య ఇంటికి వచ్చేసారికి తుఫాన్ ఇల్లు మాప్ పెడతాడు. ఏమైందని సూర్య అడుగుతాడు మీ ప్లేస్ లో ఉన్నందుకు ఈ పనిష్మెంట్ అని తుఫాన్ జరిగింది చెప్తాడు. మీరు చెప్పినట్టు బెడ్ పై పడుకున్నా అమ్మగారు మీరు అనుకొని వచ్చారు. నన్ను మీ ప్లేస్ లో చూసి చెంపచెల్లుమనింపించిందని తుఫాన్ చెప్తాడు. అప్పుడే భువన వస్తుంది. నువ్వు నాతో రా అని సూర్యని తీసుకొని వెళ్తుంది.
మరొకవైపు మురళికి కిన్నెరా ఫోన్ చేసి బ్యాంకు వాళ్ళు వచ్చిన దాని గురించి చెప్తుంది. ఆ తర్వాత సింహాద్రి ఇంటికి జానూ, నందు వెళ్తారు. అంకుల్ ఇంట్లో లేరని సింహాద్రి భార్య చెప్తుంది. వాళ్ళు జరిగింది చెప్తారు. మీరు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అంకుల్ కి ఫోన్ చేస్తే తనే మేనేజ్ చేసేవాడు కదా అని ఆవిడ అనగానే ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోతేనే ఇక్కడ వరకు వచ్చామని జానూ అంటుంది. తరువాయి భాగంలో బ్యాంకు వాళ్ళు ఇంటికి తాళం వేస్తారు. జానూ తన కుటుంబాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |